Latest Posts

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు..!

బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. ఆ పార్టీకి చెందిన పటాన్‌చేరు ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

 

ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడ మధుసూధన్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేపట్టారు. సోదాల విషయం నియోజకవర్గంలోనేకాదు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపాలు చేస్తున్నారు.

గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసు‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలావుండగా రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో నిధులు వ్యవహారంపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించి సంతోష్ గ్రానైట్ కంపెనీ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. ఓ కేసులో మహిపాల్‌రెడ్డి సోదరుడు మధు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

Editor