Latest Posts

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU..

ప్రెస్ నోట్

11:02:2024

 

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU

 

PSCWU – IFTU

 

సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు చాలీచాలని వేతనాలతో అరకొర సౌకర్యాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీతాలు పెరుగుతాయని తమ బతుకులు బాగుపడతాయని తమను పర్మినెంట్ చేస్తారని ఆశించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు టిఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నైనా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను గుర్తించాలని కోరారు. గత 18 రోజుల సమ్మెలో పాల్గొని నష్టపోయిన కాంట్రాక్టు కార్మికులు తీవ్ర నిరాశా నిస్పృహలో ఉన్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించాలని, వారికి వేతనాల పెంపు చేయాలని, కోల్ ఇండియాలో అమలు జరుగుతున్న వేతనాలను ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీ రేవంత్ రెడ్డి గారికి సమర్పించిన వినతిపత్రంలో కోరడం జరిగింది. *ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ PSCWU IFTU రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది*. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.

 

విప్లవ అభినందనలతో

 

తోకల రమేష్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్

PSCWU IFTU

Editor