కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాసూరి శంకర్ గారు పాల్గొని కార్మికుల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కార్మికులకి న్యాయమైన డిమాండ్లపై సింగరేణి యాజమాన్యం ఇటు గవర్నమెంట్ అలసత్య ధోరణితో వ్యవహరిస్తూ వారికి రావలసిన జీత బత్యాల విషయమై ఆలస్యం చేస్తూ సింగరేణి లాభాలవాటు ఆర్జిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకి జీతభత్యాలు పెరుగుదల అయితే సింగరేణి లాస్ వస్తుంది అని యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్ట కొడుతుందనే దాని విషయమై లీగల్ గా అయితే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతోటి కోర్టులో సింగరేణి యాజమాన్యం మీద కేస్ వేయడం జరిగింది దానికి సంబంధించి మూడో తారీకు ప్రతి కాంట్రాక్టర్ కి నోటీసులు వెళ్లడం దాన్లో భాగంగా కొంతమంది కాంట్రాక్టులు రావడం మిగతా వాళ్ళు రాకపోవడం ఇలా జరగడం వల్ల 17వ తారీకు తిరిగి వాయిదా వేయడం ఆ వాయిదాలో కచ్చితంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని కోర్టు కూడా చెప్పడం జరిగిందని అని కార్మికులను ఉద్దేశించి చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా హై పవర్ వేతనాలు సండే డబల్ మాస్టర్ పండగ త్రిబుల్ మాస్టర్ వైద్య సదుపాయాలు సింగరేణి స్కూల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి పిల్లలకు కూడా ఉచితంగా ఇవ్వాలని అదేవిధంగా తదితర అంశాల మీద కేసు నడుస్తుందని వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డ్రైవర్ల విభాగం ఇంచార్జ్ భాష బోయిన రవికుమార్ కమిటీ సభ్యులు మున్నాభాయ్ లింగరాజు శ్యామ్ కనకరాజు రవి కుమార్ హరిఫ్ అశోక్ రాజేష్ తదితరులు అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనడం జరిగింది
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది..
