తేదీ:11-02-2024
మణుగూరు మండలం
————————————-
ఈరోజు అనగా ఆదివారం మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా నూతనంగా రెండు స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే పాయం గారు మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గ ప్రజలు నిత్యం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుండటంతో ప్రజల సౌకర్యార్థం నూతన బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ప్రభుత్వం రెండు నూతన స్లీపర్ క్లాస్ బస్సులను మంజూరు చేసిందని వారు తెలిపారు నూతన బస్సులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పాయం గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ DM, స్వామి గారు,CI, కనకదుర్గ గారు,MF, శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
