Latest Posts

రేవంత్‌ను అంత మాట అనేశాడా? కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..!

కేటీఆర్‌ శుక్రవారం ఉదయం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ సుమతి శతకాన్ని పోస్ట్‌ చేశారు. దానికి పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి’ అనే పద్యం పుస్తకంలోనిది కనిపిస్తుంది. ఈ ట్వీట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది.

 

రేవంత్‌నే అన్నాడా..

కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో కూడా ఇరు పార్టీల నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. ఓటమిని కేటీఆర్‌ జీర్ణించుకోవడం లేదు, అంగీకరించడం లేదు. దీంతో వీలైనప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ గుంపు మేస్త్రీ అని అన్నారు. దానికి రేవంత్‌ రెడ్డి కూడా కౌంటర్‌ ఇచ్చారు. తాజాగా సుమతి శతకాన్ని ట్వీట్‌ చేయడం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించిందే అన్న

Editor