🇮🇳🇮🇳గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు🇮🇳🇮🇳
తేదీ 26-1-2024
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మణుగూరులోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) మాంటిస్సోరి పాఠశాలలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని. అందుకే జనవరి 26వ తేదీన భారతదేశ ప్రజలందరూ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అని అన్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
