మేడిగడ్డ నిర్మాణంలో భారీ స్కామ్: విజిలెన్స్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిర్మాణం పేరుతో రూ.3200 కోట్ల ప్రజాధానం వృథా చేసినట్లు గుర్తించింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది. అలాగే నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని తేల్చింది. వరద ఉద్ధృతి అంచనా లేకుండానే డిజైన్ రూపొందించారని తెలిపింది. కాగా, బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరగలేదని విజిలెన్స్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Editor