అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. జనవరి 18న రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయంలోకి ప్రవేశపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడి పట్టాభిషేకమంత గొప్పగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్త ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 22న రాష్ట్రంలో సెలవు ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సెలవు ప్రకటించాయి.
అయోధ్య రామాలయం.. కేంద్రం మరో వరం..
