కేసీఆర్‌ కిట్‌ ఇక.. ఎంసీహెచ్‌ కిట్‌..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్‌కు సంబంధించి సీఎం రేవంత్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసీఆర్‌ కిట్‌కు బదులు ఎంసీహెచ్‌ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. కేసీఆర్‌ కిట్‌లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటోలపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లను అతికించి దానిపై ఎంసీహెచ్‌ కిట్‌ అని పేరు రాసి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు.

Editor