Latest Posts

గొర్రెల కాపరులకు రూ.10లక్షల బీమా.. : చంద్రబాబు..

గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తామని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా శనివారం కురబలతో సమావేశం నిర్వహించారు. బాబు మాట్లాడుతూ ’ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. కురబలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది‘ అని అన్నారు. ఎప్పుడూ మన మూలాలను మరచిపోకూడదని బాబు అన్నారు.

Posted Under AP
Editor