స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోలేదు. గతంలో ఒప్పుకొని అడ్వాన్స్ లు తీసుకున్నవి ఉంటే వాటిని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది. మయోసైటిస్ వల్ల ఒక సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. చికిత్స తీసుకుంటే విదేశీ పర్యటనలు చేస్తోంది. తాను ఎక్కడికెళ్లింది? ఏం చేస్తున్నది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తోంది.
తాజాగా ట్రలాలా అనే ప్రొడక్షన్ కంపెనీని సమంత ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ కింద కొత్తవాళ్లను ప్రోత్సహించాలని సమంత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యతో ఒక సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగమ్మాయిలో అంత టాలెంట్ ఉండటంతో కచ్చితంగా మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సమంత ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
samantha offer to baby heroine vaishnavi chaitanya
బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు భారీసంఖ్యలో ఆఫర్లు వస్తాయని భావించారు. అయితే ఆఫర్లు రావడంలేదా? లేదంటే వైష్ణవి ఒప్పుకోవడంలేదో తెలియదుకానీ కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. బేబీ తీసిన సాయి రాజేష్ దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు చేయడానికి బేబీకి ముందే అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ప్రకారం తన రెండు, మూడు సినిమాలు కూడా సాయి రాజేష్ తోనే చేయాల్సి ఉంటుంది.
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం కోసం ఒక హీరోయిన్ గా వైష్ణవి ఎంపికైందంటూ వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందటూ వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ఏది నిజమనేది తెలియాలంటే స్వయంగా వైష్ణవి చైతన్య చెబితేనే తెలుస్తుంది. అప్పటివరకు ఓపిక పట్టాలి.
