Latest Posts

యశోధ ఆస్పత్రికి నేరుగా వచ్చి… కేసీఆర్ ముందర నిలిచి.. రేవంత్ పరామర్శ వైరల్..

కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరానని సీఎం రేవంత్‌ చెప్పారు. ప్రజాపాలనలో కేసీఆర్‌ సలహాలు, సూచనలు తీసుకుంటామని.. కేసీఆర్‌ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ కూడా వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

 

ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శ

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ ను పరామర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్త యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న మంత్రి పొన్నం.. ఉదయం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కార్యకర్తను పరామర్శించారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే వైద్యులు కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. దీంతో ఆయనను చూసి వచ్చారు. తర్వాత మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావులతో భేటీ అయ్యారు.

Editor