Latest Posts

ఏపీలో భారీ వర్షాలు.. విధ్వంసం సృష్టిస్తోన్న మిఛౌంగ్ తుపాను..

బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 

మంగళవారం సాయంత్రానికి బాపట్ల- మచిలీపట్నం మధ్య, బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వేగం కొద్దిగా మందగించింది. ఇదివరకు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదలగా.. ఇప్పుడు 12 కిలోమీటర్లకు పరిమితమైనట్లు ఐఎండీ పేర్కొంది.

Posted Under AP
Editor