తెలంగాణలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడూ పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణిలో లోపాలున్నాయని విమర్శించారు. తెలంగాణ రూపు రేఖలు మారాలంటే బీజేపీ- జనసేన కూటమని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ పైనా పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
బీజేపీతోనే సాధ్యం : కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని పవన్ అన్నారు. తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేసిదే బీజేపీ మాత్రమేనని చెప్పారు. మోదీ నేతృత్వంలోనే విద్య, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని.. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ది జరగుతుందన్నారు. యువత భవిష్యత్తు కోసం జనసేన తెలంగాణలో పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని పవన్ వెల్లడించారు. బీఆర్ఎస్‌ని ఒక్కమాట అనక పోవడానికి కారణం తాను ఇక్కడ తిరగక పోవడమేనని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan made interesting comments on KCR and REvanth in Election Campaign
ఆ పోరాటమే స్పూర్తి : ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తి అని పవన్ చెప్పుకొచ్చారు తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందన్నారు. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నానని పవన్ వివరించారు. కేసీఆర్, టీపీసీసీ రేవంత్ రెడ్డితో తనకు మంచి పరిచయాలున్నాయని… స్నేహం వేరు, రాజకీయం వేరని విశ్లేషించారు. ఏదీ ఏమైనా తెలంగాణలో అభివృద్ది ఒకే చోట కేంద్రీకృతమైందని.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలనేదే తన ఆకాంక్ష అని పవన్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టే అభివృద్ది జరిగిందన్నారు. అక్కడ ఎకరం కోట్లలో పలుకుతుంటే.. పల్లెలు మాత్రం అభివృద్ధికి నోచుకోవటం లేదని పవన్ వ్యాఖ్యానించారు.
జనసేన అండగా ఉంటుంది : తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నానని చెప్పారు. ఎవ్వరు వచ్చినా రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా ఉంటానని గుజరాత్ వెళ్లి కలిశానని గుర్తు చేసారు. నిధులు, నీళ్ళు, నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణ అనుకున్న స్థాయిలో లేదన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమేనని స్పష్టం చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయమని పవన్ పేర్కొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్ లీక్స్ లేకుండా ఉండాలంటే బీజేపీ రావాలని పవన్ పేర్కొన్నారు.
