ఎన్నికలు అనేది సెకండరీ – మన లక్ష్యం అదే: సీఎం జగన్..!!

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. తమ పిల్లలకు గౌరవ ప్రదంగా పెళ్లీళ్లు చేసి.. పిల్లలకు వివాహ జీవితాలను మొదలుపెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనవారని భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.

 

నిధులు విడుదల : వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు ఈరోజు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు.

, డీప్ ఫేక్ వీడియోస్, రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో, కాజోల్ డీప్ ఫేక్ వీడియో, నరేంద్ర మోడీ డీప్ ఫేక్ వీడియో, ప్రధాని మోడీ డీప్ ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోడీ, డీప్ ఫేక్ వీడియోలపై కేంద్ర ప్రభుత్వ చట్టం, డీప్ ఫేక్ వీడియోపై అశ్వినీ వైష్ణవ్, సోషల్ మీడియా సంస్ధలతో అశ్వినీ వైష్ణవ్ భేటీ, డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం చర్యలు,

ఈ పథకంలో ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల్లో ఆర్థికసాయం అందజేయడం జరిగిందన్నారు. 2022 అక్టోబర్‌నుంచి మొదలుపెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుందని వెల్లడించారు. ఒక పథకం తీసుకువస్తే దాని వెనుక ఒక ఉద్దేశం, సంకల్పం ఉండాలన్నారు. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణలక్ష్మి, షాదీ తోఫాగా వివరించారు.

Posted Under AP
Editor