Latest Posts

రెబల్స్‌ డ్రాప్‌.. బరి నుంచి తప్పుకున్న ఇండిపెండెంట్లు!

తగ్గిన ఇండిపెండెంట్లు..

నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో స్వతంత్రులు బాగా తగ్గిపోయారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి స్వతంత్రుల హవా బాగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక బరిలో ఉన‍్న ఇండిపెండెంట్లలో ఒక్కరు కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఓటర్లు గడిచిన 2014, 2018 ఎన్నికల్లోనూ స్వతంత్రులను గెలిపించలేదు. ఈసారి కూడా స్వతంత్రులు బలమైన వారు లేదు. దీంతో బరిలో ఉన్నవారు గెలిచే అవకాశం కూడా పెద్దగా లేదని తెలుస్తోంది.

 

80 స్థానాల్లో ద్విముఖ.. 30 స్థానాల్లో త్రిముఖ..

ఇక నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసే‍్త వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 80 నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30 స్థానాల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ రెబల్స్‌ను బుజ్జగించడంలో ఆ పార్టీ ఎప్పుడూ లేనంతగా సక్సెస్ అయింది. ఏఐసీసీ నేతల్ని రంగంలోకి దింపి… అందర్నీ బుజ్జగించగలిగారు. అధికారంలోకి వ‌చ్చాక అనేక ప‌ద‌వులు వ‌స్తాయ‌ని, వాటిల్లో అవకాశం కల్పిస్తామని న‌చ్చజెప్పారు. కొంత మంది తిరుగుబాటు అభ్యర్థులకు ఇప్పటి వరకూ చేసిన ఖర్చును చెల్లిస్తామని అభ్యర్థులు హామీలు ఇచ్చారు. ప్రధాన పార్టీల రెబల్స్, బలమైన ఇండిపెండెంట్లు పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో 80 స్థానాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యనే ముఖాముఖి పోటీ ఉండే అవకాశం ఉంది.

 

గ్రేటర్‌లో బీజేపీవైపు..

ఇక ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లో కొని‍్న నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మంచి పట్టు ఉంది. గ్రేటర్ హైద్రాబాద్‌తోపాటు ప‌లు జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్న చోట త్రిముఖ పోటీ సాగనుందని తెలుస్తోంది. త్రిముఖ పోటీ స్థానాల్లో చాలాచోట్ల పోలింగ్ తేదీ సమీపించే నాటికి ద్విముఖ పోటీ నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ, సీపీఎం పోటీ ఎవరి ఓట్లను చీల్చుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Editor