Latest Posts

రెబల్స్ తో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్..!

తెలంగాణ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) నామినేషన్లు, స్క్రూటినీ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులపై దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ వరకు గడువు ఉండడంతో పార్టీల సీనియర్లు అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కూడా రెబల్ అభ్యర్థులతో మాట్లాడుతోంది. చివరి క్షణం వరకు టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వారితో చర్చిస్తున్నారు.

 

Advertisement

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంగ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెబల్స్ ఆపరేషన్ చేపట్టారు. అభ్యర్థులను అక్కడికి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు చీలకుండా తీసుకుంటున్న చర్యలో భాగంగానే రెబల్స్ తో చర్చలు ప్రారంభించారు. ఆదిలాబాద్ లో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గండ్ర సుజాత మద్దతుతో బరిలోకి దిగిన సంజీవరెడ్డితో విత్ డ్రా చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

సూర్యాపేటలో ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేసిన పటేట్ రమేశ్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకునేలా చర్చలు జరుపుతున్నారు. బోథ్ నుంచి బరిలోకి అశోక్, నరేశ్జాదవ్ లతో కూడా చర్చలు జరిపారు. వరంగల్ వెస్ట్ నుంచి జంగారాఘవరెడ్డి రెబల్ గా బరిలో నిలిచారు. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేలా బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్పోరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చాలే ఒప్పంద చేసుకునేలా మాట్లాడుతున్నారు.

 

ఇబ్రహీం పట్నం నుంచి బరిలో నిలిచిన దండెం రాంరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. వైరా నుంచి నామినేషన్ వేసిన విజయభాయ్, నర్సాపూర్ నుంచి నామినేషన్ వేసిన గాలి అనిల్ కుమార్, డోర్నకల్ నుంచి బరిలోకి దిగిన నెహ్రూ నాయక్ కూడా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో బుధవారం తేలిపోనుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రచారం దూకుడుగా చేస్తోంది. అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్నారు.

 

ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకున్నారు. అలాగే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ కూడా రైతులకు వివరిస్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

Editor