Latest Posts

ఈ గ్రామంలో ఆరుదశాబ్దాలుగా శ్మశానంలో దీపావళి సంబురాలు…

దీపావళి సంబురాలు మొదలయ్యాయి. ఈ పండుగక్కి ఇల్లంతా దీపాలతో అలంకరించి, లక్ష్మిమాతాను కొలచి, ఎంతో వైభవంగా పటాసులు కాలుస్తూ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాలామంది ఇంటిదగ్గర, స్నేహితులతో కలిసి, కార్యాలయాల్లో జరుపుకుంటారు.

కానీ, తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం ఈ పండుగను శశ్మానంలో చేసుకుంటున్నారు. ఇక్కడ చనిపోయినవారిని స్మరించుకుంటూ కుటుంబసభ్యుల సమాధిల దగ్గర దీపాలు వెలిగించి మరీ ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.

హిందూ శ్మశాన వాటికలో…దీపావళి పండుగ..:తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలోని కార్ఖాన గడ్డలో ఈ వింత ఆచారం గత ఆరుదశాబ్దాల నుంచి నడుస్తుదంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ కార్ఖాన గడ్డలో ఉన్నవారంతా దళిత కుటుంబానికి చెందినవారే కావడం విశేషం. అయితే, వీరంతా కలిసి ఈ పండుగ సందర్భంగా ఆ ప్రాంతంలోని హిందూ శ్మశాన వాటికలో ఉన్న తమ కుటుంబసభ్యుల సమాధుల దగ్గరకు వెళతారు. పండుగకు వారం రోజుల ముందే ఆ గ్రామస్థులు సమాధులు ఉండే ప్రాంతాన్ని శుభ్రం చేసే పనిని మొదలుపెడతారు. అక్కడంతా శుభ్రంచేసి, సమాధులకు పెయింట్లు వేసి, వాటిని పూలతో అలంకరిస్తారు. ఇక పండుగ నాడు అక్కడ దీపాలను వెలిగించి, చనిపోయిన వారికి ఇష్టమైన పిండి వంటకాలను వండి వాటిని నైవేద్యంగా పెడతారు. అక్కడే రాత్రంతా ఉండి దీపావళి పటాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ ఆచారాన్ని ఇక్కడి వారు ఎప్పటినుంచో పాటిస్తున్నారు.

పండుగ రోజు పూర్వికులను స్మరించుకుంటారు..:వినడానికి ఈ పద్థతులు కాస్త వింతగా ఉన్నా, చనిపోయిన వారిని స్మరించుకోవడం వారికెంతో ఆనందంగా ఉందంటున్నారు ఇక్కడి వారు. దీపావళి సందర్భంగా ఇలా చేయడం ద్వారా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని ఈ గ్రామస్థులు భావిస్తున్నారు. అందుకే ఈ ఆచారాన్ని గత ఆరుదశాబ్దాల నుంచి పాటిస్తున్నారు. తమ పూర్వీకులు వారి మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు శ్మశాన వాటిక దగ్గరక వెళతారని ఇక్కడివారు అంటున్నారు. ఉద్యోగాల నిమిత్తం వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్లినవారంతా ఈ పండుగకు తప్పకుండా ఊరికి చేరతారని, కుటుంబసభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటారని ఇక్కడివారు అంటున్నారు. ఈ పండుగ సందర్భంగా గ్రామంలోని వారంత కొత్త బట్టలు ధరించి పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి అక్కడే పటాసులు కాల్చుతూ సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ నాడు పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని ఇక్కడివారు అంటున్నారు.

YES9 TV