మహబూబ్ నగర్ కాంగ్రెస్ గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారు. ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
నాగం మరో రెండు మూడు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. ఆదివారం సాయింత్రం మంత్రి కేటీఆర్ నాగం జనార్ధన్ రెడ్డికి వెళ్లనున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. జనార్ధన్ రెడ్డి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
నాగర్ కర్నూల్ టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం రాజేశ్ రెడ్డికి కేటాయించింది. అప్పటి నుంచి నాగం అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ లో టికెట్ రాని వారు బీఆర్ఎస్ లోకి.. బీఆర్ఎస్ లో టికెట్ రాని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆ పార్టీలు వీడారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పటాన్ చెరుకు సంబంధించి బీఆర్ఎస్ నేతు నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు.
ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఆయన పేరు ప్రకటించలేదు. పటాన్ చెరు స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. బండి రమేష్ టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ ఆయనకు కూకట్ పల్లి సీట్ కేటాయించింది. ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది.
దీంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆయన సోదరి విజయరెడ్డికి మాత్రం ఖైరతాబాద్ నుంచి టికెట్ కేటాయించింది. అందుకు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదని సమాచారం.
