కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చిత్రం లియో. ప్రస్తుతం ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో పాటలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
థియేటర్లలో విడుదలైన తొలినాడే ఈ సినిమా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ రికార్డులను బద్దలు కొట్టింది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్‌తో పాటు త్రిష, సంజయ్ దత్, అర్జున్, శాండీ, మిష్కిన్, గౌతమ్ మీనన్ తదితరులు నటించారు.
ఇప్పటికే ఈ సినిమా గురించి విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటు ,టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమా నేడు రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే విజయ్ దళపతి లియో సినిమా జవాన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. విడుదలైన తొలి రోజే విజయ్ దళపతి లియో ఈ రికార్డును దక్కించుకుంది. జవాన్ మొదటి రోజు 15.75 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, లియో సినిమాకు తొలి రోజు ఆరు లక్షల టికెట్లను విక్రయించినట్లు వెల్లడించారు.
తమిళ భాషలోనే లియో సినిమాకు 13.75 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు హిందీ భాషలలో 2.10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఏది ఏమైనా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన జవాన్ సినిమా తొలిరోజు రికార్డును, విజయ్ దళపతి లియో సినిమా బద్దలు కొట్టింది.
