టీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా సిద్దం – లిస్టులో ఉన్నది వీరే..!!

తెలంగాణ(Telangana) ఎన్నికల రాజకీయం హీటెక్కుతోది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. బీఆర్ఎస్(BRS) అభ్యర్దులను ఖరారు చేసి..ప్రచారంలో మందుంది.

బీజేపీ(BJP) అభ్యర్దుల ఎంపిక పై కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్(Congress) ఎన్నికల కమిటీ అభ్యర్దుల ఎంపిక పైన కుస్తీ పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో దాదాపు 62 నియోజకవర్గాలకు అభ్యర్దులు ఖరారు అయినట్లు సమాచారం. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తుది దశకు కసరత్తు: కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా కీలక దశకు చేరుకుంది. పార్టీ ముఖ్య నాయకులు ఈ నెల 15 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. ఆ యాత్ర తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 62 నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మిగిలిన వాటిలో రెండు, మూడు పేర్లను ఎంపిక చేసింది.

అయితే వీటిలో 25కు పైగా సీట్లలో ఎంపికపై అభ్యంతరాలు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో ఫ్లాష్‌ సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చొప్పున మూడు సంస్థలు ఈ ఫ్లాష్‌ సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీలకు 25 నుంచి 27 సీట్ల వరకూ కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

ఖరారైన జాబితాలో: ఇప్పటి వరకు ఖరారు అయినట్లుగా తెలుస్తున్న జాబితాలో.. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి, మధిర : భట్టివిక్రమార్క, హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంథని : శ్రీధర్‌బాబు, సంగారెడ్డి : జగ్గారెడ్డి, భద్రాచలం : పొదెం వీరయ్య, ములుగు : సీతక్క, జగిత్యాల : జీవన్‌రెడ్డి, కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు, నాగార్జున సాగర్‌ : జానారెడ్డి, కోదాడ : పద్మావతీరెడ్డి, నకిరేకల్‌ : వేముల వీరేశం, భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ : కొండా సురేఖ, భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ, వర్థన్నపేట : కేఆర్‌ నాగరాజు, పాలకుర్తి : ఝాన్సీరెడ్డి, నర్సంపేట : దొంతి మాధవరెడ్డి, మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు, ఆదిలాబాద్‌ : కంది శ్రీనివా్‌సరెడ్డి, ఆసిఫాబాద్‌ : శ్యామ్‌నాయక్‌, చెన్నూరు: నల్లాల ఓదెలు, ముథోల్‌ : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, సిర్పూర్‌ : రావి శ్రీనివాస్‌, నిర్మల్‌ : కూచాడి ,శ్రీహరిరావు, బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్‌, వేములవాడ : ఆది శ్రీనివాస్‌, కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు ఉన్నట్లు సమాచారం.

మారుతున్న లెక్కలు: వీరితో పాటుగా.. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి, మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి : విజయ రమణారావు, కామారెడ్డి : షబ్బీర్‌ అలీ, బాల్కొండ : సునీల్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌: ధర్మపురి సంజయ్‌, బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు, బాన్సువాడ : సుభాష్ రెడ్డి, ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌, అందోల్‌ : దామోదర రాజనర్సింహ, మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు, గజ్వేల్‌ : నర్సారెడ్డి, తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పరిగి : రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌,శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్‌, మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు, 0.

ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి, నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్‌, షాద్‌నగర్‌ : వీరవల్లి శంకర్‌, కొల్లాపూర్‌ : జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట : వంశీకృష్ణ, అలంపూర్‌ : సంపత్‌కుమార్‌, కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి, . నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజేష్ రెడ్డి, నారాయణపేట : ఎర్ర శేఖర్‌, మహబూబ్‌నగర్‌ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల్‌ : సరితా తిరుపతయ్య, జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి, ఆలేరు : బీర్ల ఐలయ్య పేర్లు ఖరారయ్యని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

YES9 TV