కెనడాతో చేతులు కలిపిన అమెరికా- భారత్‌కు వ్యతిరేకంగా పావులు..!!

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్..

హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన రేపిన ప్రకంపనలు ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి.

జూన్ 18వ తేదీన ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జార్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాలో ఈ హత్య చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనేది కెనడా చేస్తోన్న ఆరోపణ.

ఈ హత్యకేసు వ్యవహారంలో ముమ్మర దర్యాప్తు సాగిస్తోంది కెనడా ప్రభుత్వం. ఇందుకు తనవంతు పూర్తిస్థాయి సహాయ సహాకారాలను అందించాలంటూ అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌కు సూచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదొక అనూహ్య పరిణామంగా భావిస్తోన్నారు.

విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అమెరికాలో పర్యటించిన సమయంలోనే అమెరికా కీలక ప్రకటన చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లేవనెత్తిన ఆరోపణలు, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఆ దేశం కొనసాగిస్తోన్న దర్యాప్తుపై పూర్తిగా సహకరించాలంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్.. జైశంకర్‌కు సూచించారు.

ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ప్రకటనే చేసింది అమెరికా. నిజ్జర్ హత్యకేసులో భారత ప్రమేయం ఉందా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు తెలిపింది. ఈ విషయంలో కెనడాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కెనడాతో కలిసి పని చేస్తోన్నామని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిల్లర్ మాట్లాడారు. నిజ్జర్ హత్యకేసు విషయాన్ని విలేకరుల ప్రస్తావించారు. ఇటీవలే ఆంటోని బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీనిపై మిల్లర్ బదులిస్తూ- ఈ కేసులో కెనడా తాము మద్దతు గా ఉన్నామని, ఆ దేశంతో సమన్వయం చేసుకుంటూ కేసును నిశితంగా పరిశీలిస్తోన్నామని పేర్కొన్నారు.

YES9 TV