తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపు

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపునిచ్చింది.

సెప్టెంబర్ 26వ తేదీన కావేరి సమస్య కారణంగా బెంగళూరు (Bengaluru) బంద్ (bandh) చేశారు. మంగళవారం బెంగళూరు నగరం మొత్తం బంద్ చేసిన కన్నడ సంఘాలు, రైతు సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

అదే రోజు ఢిల్లీలో కావేరీ జలాల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు తమిళనాడుకు ప్రతిరోజూ మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కన్నడిగుల పోరాటంపై స్పందించని కావేరీ జలాల నియంత్రణ కమిటీపై కన్నడ అనుకూల సంఘాలు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన కర్ణాటక బంద్‌కు (bandh) పిలుపునిచ్చాయి.

అఖండ కర్ణాటక బంద్‌కు చాలా సంస్థలు మద్దతు ఇచ్చాయి, కన్నడ అనుకూల సంఘాల నాయకులు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజ్ కర్ణాటక బంద్ కు పిలుపు పిలుపునివ్వడంతో కర్ణాటకలోని (karnataka) అన్ని కన్నడ సంఘాలు కర్ణాటక బంద్ కు (bandh) మద్దతు తెలిపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కావేరి జలాల పోరాటం కోసం శుక్రవారం కర్ణాటక బంద్ కు పిలుపు నివ్వడంతో సిద్దరామయ్య ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

ప్రజల డబ్బుతో సీఎం, మంత్రులకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. హైకోర్టు ఏం చెప్పిందంటే?

రెండు రోజుల క్రితం మంగళవారం బెంగళూరు బంద్ (bandh)జరిగింది. బెంగళూరు (Bengaluru)బంద్ కారణం సిలికాన్ సిటీలో అన్ని వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. కావేరి జాలలు తాగునీటి కోసం ఉపయోగించుకుంటున్న బెంగళూరు ప్రజలు బెంగళూరు బంద్ కు (bandh)సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ కు అనుమతిలేదు అని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయాందన్ సోమవారం చెప్పినా బంద్ నిర్వహకులు ఏమాత్రం పట్టించుకోలేదు.

బెంగళూరు (Bengaluru) బంద్ కు ఐటీ హబ్ ప్రజలు, వ్యాపారులు, బెంగళూరు తమిళ సంఘాలతో పాటు పలు కన్నడ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎవ్వరూ ఊహించని విధంగా మంగళవారం బెంగళూరు బంద్ (bandh)విజయవంతం అయ్యింది. అయితే రెండు రోజుల గ్యాప్ తో మరోసారి కర్ణాటక (karnataka) బంద్ తో బెంగళూరు (Bengaluru) ప్రజలు మరోసారి బంద్ తో (bandh)ఇబ్బందులు ఎదుర్కొవడానికి సిద్దం అవుతున్నారు.

కర్ణాటక (karnataka) బంద్ కు రైతు సంఘాలు, డాక్టర్ రాజ్ కుమార్ అభిమానుల సంఘం, హీరోలు డాక్టర్ శివరాజ్ కుమార్, డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ తో పాటు పలు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సంఘాలతో పాటు మొత్తం 89 సంఘాలు కర్ణాటక బంద్ (karnataka) మద్దతు ప్రకటించాయి. కన్నడ రక్షణా వేదిక ప్రవీణ్ కుమార్ శెట్టి వర్గం కూడా కర్ణాటక బంద్ కు (bandh)మద్దతు ప్రకటించింది. మొత్తం మీద కావేరి జలాల పంపకాలు కారణంగా కర్ణాటకలో (karnataka) రోజురోజు ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి.

YES9 TV