టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసులో సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కాం లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటీషన్ ఈ మధ్నాహ్నం సంజీవ్ ఖన్నా ..భట్టి బెంచ్ ముందుకు వచ్చింది.
న్యాయమూర్తి భట్టి నాట్ బిఫోర్ మీ అంటూ విచారణకు నిరాసక్తత వ్యక్తం చేయటంతో మరో బెంచ్ కు బదిలీ చేస్తామని చెప్పారు. ఆ వెంటనే చంద్రబాబు న్యాయవాది లూధ్రా(Luthra) నేరుగా సీజే(CJI) వద్దకు వెళ్లి..విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సీజేఐ వద్ద లూధ్ర ప్రస్తావన
చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు(Supreme Court) సీజే వద్ద లూధ్రా ప్రస్తావించటానికి ముందు ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారణకు విముఖత వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ (Not Beofre Me)మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ వెంటనే చంద్రబాబు న్యాయవాది సిద్దార్ధ లూధ్ర నేరుగా సుప్రీం చీఫ్ జస్టిస్(CJI) కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఈ రోజు లిస్టు అయినా విచారణ జరగని విషయాన్ని సీజే ముందు ప్రస్తావించారు.
మరో బెంచ్ కు కేటాయింపు
చంద్రబాబు 17 రోజులుగా రిమాండ్ లో ఉన్నారని వివరించారు. దీంతో, సీజేఐ ఇప్పుడు ఏం కావాలని కోరుతున్నారని లూధ్రా(Luthra)ను ప్రశ్నించారు. వెంటనే ఈ కేసును విచారించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్దించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా అరెస్ట్ చేసారని..17 ఏ గురించి మరోసారి ప్రస్తావించారు. బెయిల్ కోరుకోవటం లేదని స్పష్టం చేసారు. కేసు..అరెస్ట్ తీరు పైన తన అభ్యంతరాలను కోర్టు ముందు ఉంచారు. ఈ సమయంలోనే సీఐడీ(CID) తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. స్వల్ప వాదనల తరువాత సీజేఐ ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో అక్టోబర్ 3న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి సుప్రీంకోర్టు(Supreme Court)కు సెలవులు కావటంతో అక్టోబర్ 3న తిరిగి కోర్టు ప్రారంభం కానుంది. అదే రోజున చంద్రబాబు కేసును విచారణకు స్వీకరించనున్నారు.
అక్టోబర్ 3న విచారణ
సుప్రీంలో చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ లో స్కిల్ లో దాఖలైన ఎఫ్ఐఆర్(FIR) పైన స్టే ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఏసీబీ కోర్టు(ACB Court) విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను సస్పెండ్ చేయాలని అభ్యర్ధించారు. ఏదైతే ప్రస్తుత విచారణ ప్రొసీజర్ జరుగుతుందో అది పూర్తిగా నిలిపివేయాలని కోరారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని, రిమాండ్ రిపోర్టులో ఎటువంటి ఆధారాలు చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం కేసు నమోదుకు గవర్నర్(governor) అనుమతి తీసుకోలేదని పిటీషన్ లో వివరించారు. ఇక, ఇప్పుడు సీజేఐ నిర్ణయంతో అక్టోబర్ 3న సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణ జరగనుంది.
