తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్(Vande Bharat) అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు.
నాలుగు రోజుల క్రితం కాచిగూడ – యశ్వంతపూర్, విజయవాడ- చెన్నై మధ్య రెండు రైళ్లు మొదలయ్యాయి. ఇక, ఇప్పుడు విశాఖ – సికింద్రాబాద్(Viakaha – Sec Bad) మధ్య నడుస్తున్న వందేభారత్ కు అదనంగా మరో మినీ వందేభారత్ ను తీసుకురానున్నారు. అయితే, ఈ రైలును ప్రస్తుత మార్గంలో కాకుండా మార్పు చేసి నడపనున్నారు.
పెరిగిన ఆక్యుపెన్సీతో: ఈ ఏడాది జనవరి మాసంలో విశాఖ – సికింద్రాబాద్ వందేభారత్(Vande Bharat) ప్రారంభమైంది. తొలి ఎనిమిది నెలల కాలంలో ఆశించిన స్థాయి కంటే ఆక్యుపెన్సీ ఉంది..ఆదరణ ఉన్న మార్గాల్లో మరో మినీ వందేభారత్ ను తీసుకొచ్చేందుకు రైల్వే(Railway) అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా.. సికింద్రాబాద్ విశాఖ – వందేభారత్ రైలు 120-130 శాతం ఆక్యెపెన్సీతో నడుస్తోంది.
ఇదే సమయంలో చాలా నెలలుగా సాధారణ ప్యాసింజర్ రైళ్లు రద్దు..ఎక్సెప్రెస్ రైళ్ల నిర్వహణలో చోటు చేసుకుంటున్న మార్పులతో వందేభారత్(Vande Bharat) కు ఆదరణ పెరుగుతోంది. దీంతో, ఇప్పుడు విశాఖ నుంచి సికింద్రాబాద్(Visakha – SEc Bad) మధ్య కొత్తగా వందేభారత్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది.
అయిదో వందేభారత్: దేశంలో ప్రస్తుతం పరుగుపెడుతున్న వందేభారత్ రైళ్లలో ముంబై-గాంధీనగర్, ఢిల్లీ-వారణాసి, సికింద్రాబాద్-విశాఖపట్నం రైళ్లు గరిష్ట ఓఆర్‌తో తిరుగుతున్నాయి. వీటిల్లో విశాఖ రైలు ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ స్థిరంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో మరో మినీ వందేభారత్(Minis Vandebharat)కు అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వేబోర్డు దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం వరంగల్ మీదుగా విశాఖ వందేభారత్ రైలు తిరుగుతోంది. గుంటూరు(guntur) మీదుగా రెండో వందేభారత్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత మార్గంలోనే కొనసాగుతూ, అక్కడి నుంచి గుంటూరు, నడికూడి, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకొనేలా రూట్ ఖరారు చేయనున్నారు.
గుంటూరు మీదుగా: ఇటీవల దేశ వ్యాప్తంగా తొమ్మిది వందేభారత్(Vande Bharat) రైళ్లను ప్రారంభించినప్పుడు కాసర్‌గాడ్-తిరువనంతపురం మధ్య రెండో వందేభారత్ రైలును పట్టాలెక్కించింది. ఇదే సమయంలో విశాఖ- భువనేశ్వర్ మినీ వందేభారత్ ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంది. దీని పైన వచ్చే నెలలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రబాద్ మధ్య నడుస్తున్న జన్మభూమి (Janmabhoomi)ఎక్స్ ప్రెస్ విజయవాడ, గుంటూరు మీదుగా నడుస్తోంది.
ఇదే మార్గంలో మినీ వందేభారత్(Minis Vandebharat) కు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. అయితే, ప్రస్తుతం దాదాపుగా ఇదే సమయంలో విశాఖ – సికింద్రాబాద్ మధ్య జన్మభూమి నడుస్తుండటంతో.. కొత్త రైలుకు సమయం ఏ విధంగా సర్దుబాటు చేయాలనే దాని పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.
