తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో తడిసి ముద్దవ్వడానికి పవన్ కల్యాణ్ అనే పేరు ఒక్కటి చెబితే చాలు చేసుకుంటారు.
పవన్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా? అనే ఆతృతలో అభిమానులున్నారు. పవన్ స్టామినాకు సరిపడా సినిమా రావడంలేదని వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుందంటేనే చాలు అభిమానులు ఆ సినిమా గురించి ఆరా తీస్తూ, సినిమా కి సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు.
సగం పూర్తి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సగం ఇప్పటికే పూర్తయింది. తాజాగా జరుపుకునే షూటింగ్ ఐదురోజులు ఉంటుందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పై తీయాల్సిన కీలక సన్నివేశాలన్నీ హరీష్ శంకర్ ఈ ఐదురోజుల్లో పూర్తిచేయనున్నాడు. ఈ సన్నివేశాలు సినిమాకు చాలా ముఖ్యమని తెలుస్తోంది.
1 నుంచి వారాహి యాత్ర
పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. అన్ని సెంటర్లలో రికార్డులను ఊచకోత కోసింది. మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ తో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు అనుకున్న సమయానికి జరుగుతాయా? ముందే జరుగుతాయా? అన్నది స్పష్టత రాలేదు. వారాహి యాత్రను అక్టోబరు ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభించబోతున్నారు. అవనిగడ్డ, కైకలూరు, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు చేస్తున్నారు.
