హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే.
దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ రెస్టారెంట్ వార్తల్లోనిలిచింది.
నిఖిల్ అనే వ్యక్తి.. తన ట్విట్టర్ ఖాతాలో తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఆ రెస్టారెంట్ వంట గదిని పరిశీలించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ట్యాగ్ చేశాడు.
అయితే, ప్రస్తుతం మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది. కానీ, ఆన్‌లైన్ ఆర్డర్లు మాత్రం స్వీకరిస్తున్నారని నిఖిల్ ట్వీట్‌తో వెల్లడైంది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుంటూ.. బయట నుంచి మెరిడియన్ బ్రాండ్ పేరుతో.. బయట వంటగది ఏర్పాటు చేసి డెలివరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
