హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా మ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎంపిక చేయడానికి అర్హతలు అడ్డు వస్తున్నాయంటూ.. ఎంపిక ప్రక్రియను పక్కన పెట్టారు తమిళిసై సౌందరరాజన్. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక చేసేందుకు సరైన సమాచారం లేదన్నారు. ఆర్టికల్ 171(5) ప్రకారం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎంపిక జరగలేదన్నారు.

దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వీళ్లిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదని గవర్నర్.. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ ద్వారా గవర్నర్ తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)

చెప్తోందని గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ స్పష్టం చేశారు.

 

ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిథ్య చట్టంలో స్పష్టంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనర్హత కిందకు రారని చెప్పేలా.. ఇంటెలిజెన్స్ సహా ఏ ఇతర సంస్థల నివేదికలు లేవని తెలిపారు. మంత్రివర్గ సిఫారసుతో అన్ని అంశాలను జత చేయలేదన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లను ఆమోదిస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదన్నరు. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని మంత్రి మండలి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు.

గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిలిసై సెప్టెంబర్ 19వ తేదీనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించగా.. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఇప్పుడిప్పుడే సత్ససంబంధాలు ఏర్పడుతున్నట్లు కనిపించినా.. ఈ పరిణామంతో మళ్లీ ఈ రెండు కార్యాలయాల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

YES9 TV