ముకేష్ అంబానీ ఇంట సినీ, రాజకీయ ప్రముఖుల సందడి: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రష్మిక!!

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట ఏ చిన్న సందర్భంగా అయినా ఆయన ఆహ్వానిస్తే వెళ్ళని రాజకీయ, సినీ ప్రముఖులు ఉండరు అంటే ఆశ్చర్యం లేదేమో.

ఇక ముకేష్ అంబానీ ఫ్యామిలీ కూడా సినీ, రాజకీయ ప్రముఖులతో చాలా దగ్గర సంబంధాలు కొనసాగిస్తుంది. తాజాగా ముకేష్ అంబానీ ఇంట గణేశ చతుర్థి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

ముకేశ్ అంబానీ మరియు నీతా అంబానీ గణేశ నవరాత్రి వేడుకలలో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన ముంబైలోని వారి నివాసం యాంటిలియాలో గణేశ చతుర్థి సందర్భంగా గణేశుడిని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి గణేశ నవరాత్రి వేడుకలను నిర్వహించారు.

ఘనంగా అంబానీ కుటుంబం గణేశ హారతి నిర్వహించింది. ఈ వేడుకలలో ప్రముఖులు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, పిల్లలు సుహానా మరియు అబ్రామ్ ఖాన్ లతో పాటు షారుఖ్ ఖాన్ అత్తగారైన సవిత ఛిబర్ ల తో కలిసి హాజరయ్యారు.

అంతేకాదు ఎంఎంఎస్ నాయకుడు రాజ్ ఠాక్రే మరియు ఆయన భార్య షర్మిల ఠాక్రే తో కలిసి హాజరయ్యారు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా దేశముఖ్, ఫ్యాషన్ డిజైనర్ మరియు స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా, నటి రేఖ తదితరులు హాజరయ్యారు. వీరంతా ఫోటోలకు పోజులిచ్చి ముకేష్ అంబానీ ఇంట సందడి చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా గణేశ హారతి నిర్వహించిన నీతా అంబానీ కోడళ్ళు శ్లోక మెహతా, రాధిక మర్చంట్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వేడుకకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణేశుడిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు హాజరైన నేషనల్ క్రష్ రష్మిక ఈ వేడుకలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ముకేశ్ అంబానీ ఇంట గణేషుడిని దర్శించుకుని సినీ, రాజకీయ ప్రముఖులు వారిచ్చిన విందులో పాల్గొన్నారు.

Editor