అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్ నుంచి శిధిలాలను కనుగొన్నట్లు US మిలిటరీ తెలిపింది. F-35B లైట్నింగ్ II జెట్ పైలట్ ఆదివారం మధ్యాహ్నం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
“జాయింట్ బేస్ చార్లెస్టన్, @MCASBeaufortSC నుంచి సిబ్బంది, స్థానిక అధికారులతో సన్నిహిత సమన్వయంతో, విలియమ్స్‌బర్గ్ కౌంటీలో శిధిలాల క్షేత్రాన్ని కనుగొన్నారు. JB చార్లెస్‌టన్‌కు ఈశాన్యంగా రెండు గంటల ప్రాంతంలో శిధిలాలు కనుగొన్నాము” అని బేస్ X(ట్విట్టర్) లో పేర్కొంది.
ఈ ఫైటర్ జెట్ వందల కోట్ల విలువ వందల కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదివారం సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఫైటర్ జెట్ సడెన్ గా కనిపించకుండా పోయింది. తప్పిపోయిన ఈ మల్టీ మిలియన్ డాలర్ల విమానాన్ని కనుగొనడంలో సాయం చేయాలని అమెరికా మిలిటరీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులపై విమర్శులు వెల్లువెత్తాయి. మరోవైపు విలియమ్స్ బర్గ్ కౌంటీలోని స్టకీకి సమీపంలోని అడవులపై ఫైటర్ జెట్ వెళ్లినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ లు పేర్కొన్నాయి.
అధికారులు గాలింపు చేపట్టగా.. విమానం శకలాలను గుర్తించారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోవడానికి ముందే అందులోని పైలట్ పారాషూట్ కిందికి దూకినట్లు అధికారులు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఫైటర్ జెట్ శకలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఫైటర్ జెట్ విమానం చాలా అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో అధునాతన ఫీచర్లు, రాడార్ గుర్తించకుండా ఉండే వ్యవస్థలు ఉన్నాయి.
ఫైటర్ జెట్ తప్పిపోవడంపై విమర్శలు వచ్చాయి. స్థానిక కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్ ఎక్స్ (ట్విట్టర్) లో విమర్శలు చేశారు. ఇప్పుడు తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, మీరు F-35ని ఎలా కోల్పోతారని ప్రశ్నించారు. ట్రాకింగ్ పరికరం ఎందుకు లేదని ప్రశ్నించారు. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన విమానాల ధర ఒక్కొక్కటి 80 మిలియన్లు అమెరికా డాలర్లుగా ఉందని ఆమె గుర్తు చేశారు. నెటిజన్లు కూడా విమానం జాడ కనిపెట్టిన వారికి రివార్డు అందివ్వనున్నట్లు సదరు విమానం ఫొటోలను మార్పు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
