అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం, ఇతర ఆటా సభ్యులు పాల్గొన్నారు.
2024- జూన్ నెలలో అట్లాంటా లో జరుగనున్న ఆటా- మహాసభలకు సంబంధించి చేపట్టవలసిన వివిధ అంశాలపై చర్చించారు.
పలు దశాబ్దాలుగా అమెరికాలో ప్రవాసాంధ్రుల ప్రజా సేవా చేస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ఆటా సంస్థతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సగౌరవంగా, ప్రకాశవంతంగా ప్రజ్వలింపచేస్తున్న చేసిన సంస్థ అమెరికన్ తెలంగాణ సొసైటీ విలీనమవడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ఇరు మహోత్తర సేవా సంస్థల కలయిక పరస్పర సహకారాలతో సాంప్రదాయ, సాంస్కతిక, సాంఘిక, సామాజిక , విద్య, వైద్య , సంక్షేమ కార్యక్రమాలతో అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలను ఆదరిస్తుందన్నారు.
ఈ మహత్తర కలయిక ఎన్నో అత్యద్భుత సేవా కార్యక్రమాలకు నాంది అంటూ ఆటా అధ్యక్షుడు మధు బొమ్మినేని హర్షం వ్యక్తంచేశారు. అమెరికన్ అమెరికా తెలుగు సంఘం (ఆటా) సంస్థ తో విలీనం “ప్రవాసాంధ్రుల, భావి భారతీయుల పట్ల సేవా సంకల్పానికి అసమాన బలం అని తెలంగాణ సొసైటీ అధ్యక్షులు చేమెర్ల నరేందర్ అన్నారు. సెప్టెంబరు 9 సాయంత్రం జరిగిన ఆటా కిక్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మంది స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరవ్వగా పాల్గొన్నారు.
ఈ అడ్హాక్ బృందం సభ్యులుగా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు భువనేశ్ బూజాల, కన్వీనర్ కిరణ్ పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని సభాముఖంగా ప్రకటించారు. భారత దేశంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో జరుగనున్న ఆటా వేడుకలు 2023 డిసెంబరు నెలలో 10 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
