ఐఫోన్ల వినియోగంలో ఈ నగరాలు టాప్.. ఆశ్చర్యపరుస్తున్న లెక్కలివే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్‌ (Apple) లవర్స్‌ లేటెస్ట్ సిరీస్‌ ఐఫోన్‌ 15 (iPhone 15) కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో జరగనున్న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఈ రోజు రాత్రి 10.30కి యాపిల్‌ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను ఇంట్రడ్యూస్‌ చేయనుంది.

నిజానికి భారత్‌లో కూడా ఐఫోన్‌ వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ మార్కెట్స్‌లో ఒకటైన భారతదేశంపై యాపిల్‌ కంపెనీ ఫోకస్‌ చేసింది. మార్కెట్‌ విస్తరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్‌లను లాంచ్‌ చేసింది. భారత్‌లో ఐఫోన్‌ల మ్యానుఫ్యాక్చరింగ్‌ని పెంచాలనే ప్రణాళికలను కూడా ప్రకటించింది.

లేటెస్ట్‌ ఐఫోన్‌ 15 రిలీజ్‌కి ముందు, వివిధ భారతీయ నగరాల్లో ఐఫోన్‌ల విక్రయాలు, డిమాండ్‌ను వివరించే కొత్త నివేదిక ఆన్‌లైన్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైలర్ క్రోమా, 2023కి సంబంధించి ‘ఐఫోన్‌ అన్‌బాక్స్‌డ్‌’ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇండియాలో పాపులర్‌ ఐఫోన్‌ కలర్స్‌, సేల్స్‌లో టాప్‌-3 నగరాల గురించి తెలిపింది. ఏడాది పొడవునా క్రోమా కస్టమర్ల పర్చేస్‌ ప్యాటర్న్‌ ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేసింది. ఇది ఐఫోన్‌, పర్చేస్‌ ప్యాటర్న్‌పై ఆసక్తికరమైన విషయాలను హైలైట్ చేసింది.

* ఐఫోన్ సేల్స్‌లో ఢిల్లీ టాప్‌

క్రోమా ఐఫోన్ అన్‌బాక్స్‌డ్‌ 2023 రిపోర్ట్‌ ప్రకారం.. ఇండియాలో ఐఫోన్‌పై ఎక్కువ ఉత్సాహం చూపే కొనుగోలుదారులున్న సిటీగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. 2023లో రెండో స్థానంలో ఉన్న ముంబైతో పోలిస్తే 182% ఎక్కువ ఐఫోన్ అమ్మకాలతో ఢిల్లీ అన్ని ఇతర నగరాలను అధిగమించింది. 2020 నుంచి 2021 వరకు ఐఫోన్‌ సేల్స్‌లో 47% అభివృద్ధి, అదే 2021 నుంచి 2022 వరకు గణనీయమైన 106% వృద్ధిని ఢిల్లీ నమోదు చేసింది.

ఐఫోన్ కొనుగోళ్లలో ముంబై రెండో స్థానంలో ఉండగా, 2022 సేల్స్‌లో పది రెట్లు అభివృద్ధిని కనబరచింది. 2021 నుంచి 2022 వరకు ముంబై, పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లు వరుసగా 198%, 221%, 132% వృద్ధిని అందుకున్నాయి. సూరత్, బరోడా, లక్నో, ఫరీదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్, నాసిక్, వైజాగ్ వంటి నగరాలు ఐఫోన్ సేల్స్‌లో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ గణాంకాలు భారతదేశం అంతటా యాపిల్‌ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ పాపులారిటీని సూచిస్తున్నాయి.

* ఇష్టపడే ఐఫోన్‌ కలర్స్‌

క్రోమా ఐఫోన్ అన్‌బాక్స్‌డ్‌ రిపోర్ట్‌, భారతదేశంలోని ఐఫోన్ కొనుగోలుదారుల కలర్‌ ప్రిఫరెన్స్‌లను కూడా పేర్కొంది.

ఐఫోన్‌ 11: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వారు బ్లాక్‌ కలర్‌ను ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆ తర్వాత స్థానంలో వైట్‌ నిలిచింది.

ఐఫోన్ 12: ఐఫోన్ 12 ఫోన్‌ కొనుగోలుదారులు ఎక్కువగా బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్‌ని సెలక్ట్‌ చేసుకున్నారు.

ఐఫోన్‌ 13: ఐఫోన్‌ 13లో ఎక్కువగా స్టార్‌లైట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, బ్లూ, పింక్, గ్రీన్ కలర్స్‌ను ఇష్టపడుతున్నారు.

ఇది కూడా చదవండి : రూ.16,899కే ఐఫోన్ 13.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా.. డోంట్ మిస్..

ఐఫోన్‌ 14: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్‌లకు ప్రాధాన్యత చూపారు. స్టార్‌లైట్ వైట్ మూడో స్థానంలో ఉంది.

ఐఫోన్ 13 స్టార్‌లైట్ వేరియంట్ అత్యంత పాపులర్‌ అయిన మోడల్ అని రిపోర్టు సూచిస్తుంది. దాని తర్వాత మిడ్‌నైట్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. స్టోరేజ్‌ ఆప్షన్‌ల విషయానికొస్తే.. మూడు మోడళ్లలో 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ని ఎక్కువ మంది కొనుగోలు చేశారు.

* కలర్‌ ప్రిఫరెన్స్‌లో మార్పు

క్రోమా రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాలు భారతదేశంలో వినియోగదారుల కలర్‌ ప్రిఫరెన్స్‌లలో మార్పును సూచిస్తున్నాయి. మునుపటి సంవత్సరాల్లో కలర్‌ఫుల్‌గా ఉండే ప్రొడక్ట్‌ రెడ్, గోల్డ్ వంటి కలర్స్‌ పాపులర్‌ అయ్యాయి. తర్వాత స్టార్‌లైట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి అండర్‌స్టేటెడ్‌ కలర్స్‌కి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Editor