అమరావతి: వైఎస్సాఆర్సీపీ నాయకులతో గొడవ పడండి.. మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే మీకు పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అంత మంచి నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు..
అంటూ నారా లోకేష్ చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకులు, విమర్శకుల్లో సైతం ఆలోచనలను రేకెత్తిస్తోంది.
ఇటు గన్నవరంలో సభలో కూడా నారా లోకేష్ అదే తరహాలో ప్రసంగించిన విషయం తెలిసిందే. మనం అధికారంలోకి వచ్చాక ఒకొక్కడికి ఉచ్చ పోయిస్తాం… కొందర్ని చంపేద్దాం.. ఇంకొందరిని చెడ్డీలతో నడిపిద్దాం.. అంటూ నారా లోకేష్ వారిని మూర్ఖంగా రెచ్చగొడుతున్నారు. వాళ్లు రెచ్చిపోయి వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యూజర్లు.. నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లల్లో ఆయనపై లిఖితపూరకంగా కంప్లైంట్లు ఇచ్చారు. వారి ఫిర్యాదుల మేరకు కొన్ని చోట్ల నారా లోకేష్‌పై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
లోకేష్ చేస్తోన్న ప్రసంగాల పట్ల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా భగ్గుమంటోంది. ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింస వైపు నడిపిస్తారా? అంటూ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు అంటూ నిలదీస్తోంది. హింసను ప్రేరేపించే లోకేష్ మీద , పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
జిల్లాల్లోని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తోన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టీడీపీ నాయకత్వమే కారణమని స్పష్టం చేస్తోన్నారు.
సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో అయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.
