అభ్యర్థుల ప్రకటన పూర్తి.. ఇక ప్రచారమే మిగిలింది.. రేసులో ముందున్న కారు..

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం 115 మందితో కూడిన జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు సిట్టింగ్ లందరికీ సీటు కేటాయించారు.

అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితా విడుదల చేయగాయనే రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మిగతా పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ జాబితా బయటకు రావడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు.

ప్రకటించిన అభ్యర్థుల్లో దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో వారు ప్రచారం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల హోదాలో పర్యటిస్తూ ప్రజల ఆకట్టుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వారికి చేదు అనుభవం ఎదురువుతోంది. చాలా మంది డబల్ బెడ్ రూమ్ లపై ప్రశ్నిస్తున్నారు. అలాగే దళిత బంధుపై నిలదీస్తున్నారు. చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్థులు పకడ్బందీగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరితై 100 మంది ఓటర్లకు ఒక సమన్వయకర్తను నియమించుకున్నారు.

ప్రచారంలో భాగంగా రుణమాఫీ, పింఛన్, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీలకు లక్ష రూపాయల సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోమవారం ప్రకటించిన జాబితాలో కొంత మంది సిట్టింగ్ లకు చోటు లభించలేదు. వారిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్, కామారెడ్డి గంప గోవర్దన్, ఉప్పల్, వైరా సిట్టింగ్ లకు టికెట్ కేటాయించలేదు. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

బీఆర్ఎస్ ఎన్నికల తేదీలు రాక ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు చాలా సమయం దొరుకుతుంది. ఎన్నికలకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉండడంతో ఆలోపు ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ సర్వే ఆధారంగానే టికెట్లు ఇచ్చిన పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నాయి.

YES9 TV