బెంగళూరు: విమానంలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు ఒక విదేశీ పౌరుడిని అరెస్టు చేశారు.
మాల్దీవులకు చెందిన అక్రమ్ మహ్మద్ (51)ను అరెస్టు చేశామని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు అధికారులు తెలిపారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడు అక్రమ్ మహ్మద్ ను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళా సిబ్బందితో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు.
నిందితుడు ఆగస్టు 18వ తేదీన మాల్దీవుల్లోని మాలే నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ విమానంలో బయలుదేరాడు. విమాన ప్రయాణంలో విమాన సిబ్బందికి ఫోన్ చేసి బీరు, జీడిపప్పు కావాలని అక్రమ్ మోహ్మద్ అడిగాడు. అందుకు తగ్గట్టుగానే ఎయిర్ హోస్టెస్ అక్రమ్ మోహ్మద్ కు బీరు, జీడిపప్పు తెచ్చి ఇచ్చింది. అప్పుడు నిందితుడు అక్రమ్ మోహ్మద్ ఓవర్ యాక్షన్ చేశాడు.
నేను మీలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నాను, ఇంత వరకు నీలాంటి అమ్మాయి నాకు చిక్కలేదని, మీరు నాకు పడక సుఖం ఇవ్వడానికి ఎంత డబ్బులు వసూలు చేస్తారు? మీరు ఎప్పుడు నాతో కలిసి ఉండటానికి అంగీకరిస్తారు అంటూ ఆమెతో అసభ్యంగా మాట్లాడటం కొనసాగించాడని ఆరోపణలు ఉన్నాయి,
నేను 51 సంవత్సరాలుగా మీలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాను. నేను నీకు 10 డాలర్ల బదులు 100 డాలర్లు ఇస్తాను, నాకు పడక సుఖం ఇచ్చిన తరువాత మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బు నీ దగ్గరే ఉంచుకో అంటూ ఆఎయిర్ హోస్టెస్ తో అక్రమ్ మోహ్మద్ చాలా సభ్యంగా మాట్లాడాడని బాధితురాలు సంబంధిత అధికారులకు చెప్పింది.
మరో ఎయిర్ హోస్టెస్ బీరు, జీడిపప్పు కోసం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిందితుడు అక్రమ్ తన ప్యాంటు లోపల చేయి వేసి డబ్బు కోసం వెతికినట్లు నటించి అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం ల్యాండ్ కాకుండానే రెండు సార్లు సీటులో నుంచి లేచాడు. ఎయిర్ హోస్టెస్ మీరు సీటులో కూర్చోవాలని కోరగా నేను రఫ్‌గా ఉండటానికి ఇష్టపడతాను అని అక్రమ్ మోహ్మద్ ఆమెతో అన్నాడని తెలిసింది.
నువ్వు కూడా చాలా రఫ్‌గా, సెక్సీగా ఉన్నావు అంటూ నిందితుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్దీవుల నుంచి బిజెనెస్ వీసా మీద బెంగళూరు వచ్చిన కామాంధుడు అక్రమ్ మోహ్మద్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విమానంలో ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందిని ఓ వ్యాపారి లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
