. ఈజిప్షియన్ల కళానైపుణ్యానికి ప్రతీక

ఈజిప్ట్‌.. పురాతన నాగరికతకు, చారిత్రక నిర్మాణాలకు, కళలకు, ఎన్నో చారిత్రక రహస్యాలకు నిలయం. మమ్మీలు, పిరమిడ్‌లు ఈజిప్షియన్ల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి.

వీటి పేర్ల చెప్పగానే ఇవి ఈజిప్షియన్ల నిర్మాణాలని చెప్పేస్తారు. అంతలా విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. అయితే ఈ నిర్మాణాలు సుమారు 4,500 ఏళ్ల క్రితం నాటివని పరిశోధకులు గుర్తించారు. అయితే తాజాగా పిరమిడ్‌ల నిర్మాణం కన్నా పురాతన నిర్మాణాలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అవే బోట్‌ సమాధులు. నైలు నది ఒడ్డున ఓడారిలో 14 బోట్‌ సమాధులు ఈజిప్షియన్ల కళానైపుణ్యాన్ని చాటుతున్నాయి.

1988లో బయటపడిన బోట్లు..
ఈజిప్ట్‌ రాజధానిక కైరోకు సుమారు 550 కిలోమీటర్ల దూరంలో నైలు నది పరీవాహక ప్రాంతంలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒకవైపు నది ప్రవహిస్తుంటే.. మరోవైపు ఇసుక దిబ్బలతో ఎడారిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి జనజీవనం కనిపించదు. కానీ.. అనేక తుపాన్లు, వరదల తర్వాత 1988లో ఈ ఎడారి ప్రాంతంలో బోట్లను పోలిన ఆకృతులు బయటపడ్డాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్లుగా ఉన్నాయి.

పూర్తిగా చెక్కతో నిర్మాణం..
ఈ 14 బోట్లు పూర్తిగా చెక్కతో నిర్మించినట్లు ఆర్కియాలజిస్తుటు గుర్తించారు. అయితే వాటిని తీయడానికి వీలు లేకపోవడంతో ఆధునిక టెక్నాలజీతో త్రీడీ మోడల్‌ నిర్మించారు. అదే విధంగా నమూనాల నుంచి సేకరించిన షాంపిల్స్‌ను పరిశోధించారు. ఇవి పూర్తిగా చెక్కతో నిర్మించినట్లు నిర్ధారించారు. సుమార 5 వేల ఏళ్ల క్రితం వీటిని నిర్మించినట్లు తేల్చారు. వీటి నిర్మాణంలో నాటి కాలం నిర్మాణాలకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడినట్లు గుర్తించారు. తాళ్లు, చెక్కలతో ఈ నిర్మాణాలు చేసినట్లు నిర్థారణ అయింది.

విందులు వినోదాల కోసమని..
ఈ నిర్మాణాలు ఈజిప్టు రాజులు విందులు వినోదాల కోసం నిర్మించుకుని ఉంటారని భావించారు. నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉండడం సమీపంలో పాత్రలు లభించడంతో ఇక్కడ రాజులు వినోద కార్యక్రమాలు చేసుకునేవారని భావించారు. అందుకోసమే ఈ బోట్లు ఎడారిలో నిర్మించి ఉంటారని అనుకున్నారు. వరదలకు కొట్టుకొచ్చి ఉంటే ఇలా వరుసక్రమంలో ఉండేవి కావని, ప్రత్యేక నిర్మాణాలు అయినందునే ఇలా ఉన్నాయని తేచ్చారు.

Editor