Latest Posts

ప్రభాస్ సినిమాకు మరో టైటిల్.. K అంటే అసలైన అర్థం అదా..

తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు.

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్లతో సత్తా చాటిన అతడు.. గ్లోబల్ స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో ‘Project K’ ఒకటి. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి మరో ఆసక్తికరమై న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

ప్రాజెక్టు K.. పాన్ వరల్డ్ రేంజ్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రమే ‘Project K’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

 

బ్రేకులతోనే.. అంతే పూర్తైందిగా: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘Project K’ సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నారు. అందుకు తగ్గట్లే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుం ఇప్పటికీ సగం షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేసుకున్నారు.

YES9 TV