సినీ ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelliegence) ముప్పుగా మారబోతుందా? సినీ రచయితలకు, సృజనాత్మక కళాకారుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభద్రతా భావాన్ని పెంపొందిస్తుందా?
అనే విషయం హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా సినిమా రంగంలోకి చొచ్చుకొని పోతున్న నేపథ్యంలో హాలీవుడ్ నటులు, రచయితలు సమ్మెకు పిలుపు ఇవ్వడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ సమ్మె వివరాల్లోకి వెళితే..
భవిష్యత్‌లో కళాకారులు, రచయితలు, సృజనాత్మక శక్తితో పనిచేసే వ్యక్తుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చోటు చేసుకోబోతుందనే అభద్రత మెల్లమెల్లగా హాలీవుడ్‌లో కనిపిసత్ున్నది. ఈ క్రమంలో కళాకారులకు, సినీ కార్మికులకు భద్రత కల్పించే విధంగా ఏఐ విషయంలో చట్టాలను, మార్గదర్శకాలను రూపొందించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విషయంలో కార్మికులకు ఎలాంటి ముప్పు కలుగకుండా మార్గదర్శకాలను రూపొందించాలనే విషయంపై స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్ట్సిస్ట్ అధ్యక్షుడు ఫ్రాన్ డ్రెస్చర్ స్పందించారు. క్రియేటివ్ వర్కర్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుగా మారబోతున్నది. కళాకారులు సృజనాత్మక శక్తిని, జీతాలు చెల్లించకుండా శ్రమ దోపిడి చేయకుండా నివారించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
