Latest Posts

వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన

వాతావరణ మార్పులతో ప్రపంచంపై పడుతున్న ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన! హీట్​వేవ్​తో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.

అమెరికాలో పరిస్థితులు అంత్యంత ఆందోళనకరంగా ఉండగా.. యూరోప్​, పశ్చిమాసియా, జపాన్​లు భారీ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి జపాన్​ వరకు అనేక ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​ జారీ అవ్వడం గమనార్హం.

అమెరికాలో ఇలా..

గ్లోబల్​ వార్మింగ్​ ప్రభావం అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వారాంతంలో.. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్​ వరకు ఉష్ణోగ్రతలు భయానకంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. సాధారణం కన్నా 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్​హైట్​ టెంపరేచర్​ నమోదవుతుందని అంచనా వేశారు.

Heatwave in America : ఆరిజోనా రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. రాజధాని నగరం ఫీనిక్స్​లో వరుసగా 16 రోజుల పాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏసీల్లో కూర్చున్నప్పటికీ.. ప్రజలు చెమటలు ఛిందిస్తున్నారు!

మరోవైపు భూమిపై ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలోని డెత్​ వ్యాలీ.. తాజా పరిస్థితులతో అల్లాడిపోతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు ఆదివారం 54 డిగ్రీల సెల్సియస్​ను తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నిత్యం హైడ్రేటెడ్​గా ఉండాలని సూచనలు జారీ చేశారు.

కానీ ప్రజలపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడింది! మంచి నీరు తాగుతున్నా వాంతులు అవుతున్నాయని చాలా మంది చెబుతున్నారు.

యూరోప్​లో ఇలా..

ఇక గ్లోబల్​ వార్మింగ్​ రెడ్​ అలర్ట్​ను ఎదుర్కొనేందుకు యూరోప్​ సన్నద్ధమవుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటలీ, రోమ్​తో పాటు 16 నగరాల్లో రెడ్​ అలర్ట్​ జారీ అయ్యింది.

Europe heatwave alert : “దేశ చరిత్రలోనే అతిపెద్ద హీట్​వేవ్​కు ప్రజలు సిద్ధంగా ఉండాలి,” అని ఇటలీ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రోమ్​లో సోమవారం నాటికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతాయని, మంగళవారం నాటికి 43 డిగ్రీలకు చేరుకుంటాయని తెలుస్తోంది. 2007 ఆగస్ట్​ తర్వాత ఇదే అత్యధికం!

ఫ్రాన్స్​లో కూడా హీట్​వేవ్​ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి! జూన్​లో హీట్​వేవ్​తో అల్లాడిపోయిన ప్రజలు.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అంటుంటే ఆందోళన చెందుతున్నారు.

YES9 TV