Latest Posts

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు

విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఏపీ సర్కార్… కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా…

తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను పేర్కొన్నారు. జులై 17 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 44 విభాగాల్లో కలిపి 590 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగాల పేరు – అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు – 590

విభాగాల సంఖ్య – 44

అర్హతలు – పీజీ చేసి ఉండటంతో పాటు అర్హత కలిగి ఉండాలి. ఆయా పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో వివరాలను పేర్కొన్నారు.

వయసు – ఓసీలకు 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం – జులై 17, 2023

దరఖాస్తులకు తుది గడువు – జులై 26, 2023.

రిక్రూట్ మెంట్ విధానం – అకడమిక్స్ లో మెరిట్ తో పాటు సర్వీస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులుగా నిర్ణయించారు.

దరఖాస్తు రుసుం – ఓసీలకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 500

అధికారిక వెబ్ సైట్ -https://dme.ap.nic.in/

కింద ఇచ్చిన PDFలో విభాగాలుగా ఖాళీల వివరాలతో పాటు అర్హతలు, ఇతర వివరాలు ఉన్నాయి.

స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు

అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీలను తీసుకోనుంది. మొత్తం 250 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. జులై 31 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఎంపికైన వారికి స్టైపెండ్ లకు రూ.8,000 నుంచి రూ.9,000గా చెల్లిస్తారు. www.vizagsteel.com వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

Posted Under AP
YES9 TV