Latest Posts

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడి, వీడియోలు తీసి స్నేహితులకు పంపి!

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక వీడియోలు తీసి స్నేహితులకు పంపాడు. స్కూల్ అటెండర్ తో సహా నలుగురు మృగాళ్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

విశాఖలో ఈ దారుణం చోటుచేసుకుంది. వీడియోలు బయటపెడతామని బాలికను బెదిరించి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి స్కూల్ అటెండర్ అరెస్టు చేశారు పోలీసులు.

అసలేం జరిగింది?

విశాఖలోని ఓ స్కూల్ లో సత్యరావు అటెండర్‌గా పనిచేస్తున్నాడు. బాలిక ఉంటే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న అటెండర్…బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ… వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన ఫ్రెండ్స్ కు పంపించాడు. ఆ కామాంధులు కూడా బాలికను బెదిరించి పలుమార్లు లైంగికంగా వేధించారు. అంతేకాకుండా బాలికను చిత్ర హింసలకు గురిచేశారు. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు.. ఆరా తీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు స్కూల్ అటెండర్ సత్యారావును అరెస్టు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాలికకు విశాఖ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసును దిశ పోలీసు విభాగానికి బదిలీ చేశామని పోలీసులు అధికారులు తెలిపారు.

ఐదేళ్ల చిన్నారిపై దారుణం

ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 5 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్​ అమేఠీ జిల్లాలోని ఓ గ్రామంలో గత బుధవారం జరిగింది ఈ ఘటన. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఉంటున్న ఇంటికి వెళ్లాడు ఓ 55 ఏళ్ల వ్యక్తి. తన ఇంట్లో టీవీ ఉందని, అక్కడ చూడవచ్చని చెప్పి, మైనర్​ను బయటకు తీసుకెళ్లాడు. అలా ఇంటికి తీసుకెళ్లిన ఆయన, 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సోతో పాటు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడిని ఇంకా అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల కోసం చిన్నారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Posted Under AP
YES9 TV