దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సంఘటనా స్థలంలో 16 మంది చనిపోయారని అధికారులు నిర్ధారించారు. పారామెడిక్స్ జోక్యంతో మరికొందరిని గుర్తించాం.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారని అత్యవసర సేవల అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని వాళ్లు పేర్కొన్నారు. ఇందులో ఓ మైనర్ పూర్తిగా కోలుకుంటున్నాడని తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
