సినీ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కీలక విషయం బయట పెట్టింది. తాను టాలీవుడ్ రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ లో ఉంటే ఇప్పటికే గొప్పగా ఎదగేదాన్ని అని అన్నారు.
టాలీవుడ్ కు ఎందుకు వచ్చానో అని అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్పారు. మళ్లీ హాలీవుడ్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తెలుగు ప్రేక్షకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఇష్టపడతారని.. స్వరాష్ట్రం వారిని మాత్రం ఇష్టపడరని ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు వారిని ఇష్టపడితే వారు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఉంటారని చెప్పింది. హైదరాబద్ లోనే పుట్టి పెరిగిన నిహారిక సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాణి మూవీస్ ఎందుకు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరు అందంతో పాటు ప్రతిభ ఉన్నవారే కదా.. అంటూ ప్రశ్నించారు లక్ష్మి. తెలుగు ప్రేక్షకులకు ముంబై, పంజాబీ, కేరళ, తమిళ, కన్నడ కథనాయకలే కావాలని.. తెలుగు హీరోయిన్లు మాత్రం వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచు లక్ష్మి కొద్ది రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లాల్లో 30 పాఠశాలలను దత్తత తీసుకున్నాట్లు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనుఅందించడమే తన లక్ష్యమని మంచి లక్ష్మీప్రసన్న చెప్పారు. గత బుధవారం గద్వాల కలెక్టరేట్ కి వచ్చిన ఆమె కలెక్టర్ వల్లూరు క్రాంతితో భేటీ అయ్యారు. స్కూళ్ల దత్తతకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు లక్ష్మి. తాము దత్తత తీసుకున్నజిల్లాలోని 30 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాసెస్,మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తామని లక్ష్మి పేర్కొన్నారు.
ఇవన్నీ ఆగస్టు వరకు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని వివరించారు. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో 56 స్కూళ్లను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించామని లక్ష్మి గుర్తు చేశారు. మంచు లక్ష్మికి కలెక్టర్ క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు దత్తాత తీసుకోవడం మంచిపరిణామమని అన్నారు. ఇతర సెలబ్రెటీలు కూడా పాఠశాలలను దత్తాత తీసుకోవడం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుని పలువురు చెబుతున్నారు.
