Latest Posts

స్పేస్ సైన్స్ లో ఫ్రీ గా ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తున్న ఇస్రో; ఇందులో జాయిన్ కావడం ఇలా…

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (Isro) ద్వారా స్పేస్ సైన్స్ లో శిక్షణ పొందే సదవకాశం లభిస్తోంది. అదికూడా, ఆన్ లైన్ లో ఫ్రీగా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇలా చేయండి..

ఫ్రీ ఆన్ లైన్ కోచింగ్

స్పేస్ సైన్స్, టెక్నాలజీల్లో విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం కోసం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (Isro) ఒక ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. అందులో అంతరిక్షం, అంతరిక్ష పరిశోధనలు, విశ్వాంతరాళ రహస్యాలు.. మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఈ ఆన్ లైన్ ట్రైనింగ్ లో ఈ కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు.

అంతరిక్షం గురించి పరిచయం
సౌర వ్యవస్థ
గ్రహ సముదాయ విశేషాలు
అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు
ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ
భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్ర, ఇతర వివరాలు
స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకు అవకాశం
ఎప్పుడు, ఎలా జాయిన్ కావడం?

ఈ ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమం జులై – ఆగస్ట్ నెలల్లో జరుగుతుంది. రెండు, లేదా మూడు వారాల పాటు రోజుకు రెండు, లేదా మూడు గంటల క్లాస్ ఉంటుంది. ఇస్రో ఈ – క్లాస్ ప్లాట్ ఫామ్ https://eclass.iirs.gov.in ద్వారా ఈ ట్రైనింగ్ ఉంటుంది. సైన్స్ లేదా టెక్నాలజీలో డిగ్రీ లేదా పీజీ చేస్తున్న విద్యార్థులు ఇందులో చేరడానికి అర్హులు. వేేరే సబ్జెక్ట్ లకు చెందిన విద్యార్థులు కూడా ఈ శిక్షణ పొందవచ్చు. కానీ, వారికి మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వరు. వారు https://www.youtube.com/@edusat2004 లింక్ ద్వారా క్లాసెస్ వినవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు https://elearning.iirs.gov.in/edusatregistration/student ద్వారా జాయిన్ కావాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత విద్యార్ధులకు ఈ మెయిల్ ద్వారా ఒక లింక్ ను పంపిస్తారు. ఆ లింక్ ద్వారా విద్యార్థులు స్టార్ట్ ప్రొగ్రామ్ లో ఎన్ రోల్ కావాలి. ఈ శిక్షణ కార్యక్రమానికి నోడల్ సెంటర్స్ గా 280 యూనివర్సిటీలను ఎంపిక చేశారు. ఆయా వర్సిటీల విద్యార్థులు మాత్రమే ఈ ట్రైనింగ్ పొందడానికి అర్హులు.ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం.

YES9 TV