Latest Posts

ఈఎంఆర్ఎస్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ ల భర్తీ; మొత్తం 4 వేల పోస్ట్ లు..

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Eklavya Model Residential School, EMRS) లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ తో మొత్తం 4062 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి..

ఈ పోస్ట్ లకు emrs.tribal.gov.in. వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈఎమ్ఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023 (EMRS ESSE 2023) కి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జులై 31వ తేదీ లోగా ఈఎంఆర్ఎస్ అధికారిక వెబ్ సైట్ emrs.tribal.gov.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయో పరిమితి.. తదితర వివరాల కోసం emrs.tribal.gov.in. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించండి.

వేకెన్సీ వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న వేకెన్సీ వివరాలు..

ప్రిన్సిపాల్ – 303 పోస్ట్ లు
పీజీటీ – 2266 పోస్ట్ లు
అకౌంటెంట్ – 361 పోస్ట్ లు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ – 759 పోస్ట్ లు
ల్యాబ్ అటెండెంట్ – 373 పోస్ట్ లు
వీటిలో అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ లు నాన్ టీచింగ్ విభాగంలోకి వస్తాయి.

ఎంపిక ప్రక్రియ, పరీక్ష ఫీజు

ఈ పోస్ట్ లకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిన్సిపాల్ పోస్ట్ కు మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిన్సిపాల్ పోస్ట్ కు రూ. 2 వేలు, పీజీటీ పోస్ట్ కు రూ. 1500, నాన్ టీచింగ్ పోస్ట్ లకు రూ. 1000 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Posted Under AP
YES9 TV