Latest Posts

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పీఈటీ, పీఎస్టీ పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.

అభ్యర్థులు తమ ఫలితాలను ssc.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

1.46 లక్షల మంది ఉత్తీర్ణులు

కేంద్ర సాయుధ పోలీసు దళాల (Central Armed Police Forces, CAPFs), ఎస్ఎస్ఎఫ్ ల్లో కానిస్టేబుల్స్, అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరొ లో సిపాయి ఉద్యోగాల కోసం నిర్వహించిన పీఈటీ, పీఎస్టీ పరీక్ష ఫలితాలను ఎస్ఎస్సీ విడుదల చేసింది. ssc.nic.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. మణిపూర్ ను మినహాయించి మిగతా ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిన తరువాత అక్కడ మళ్లీ ఈ పీఈటీ, పీఎస్టీ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 368146 అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 146292 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

how to check: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడం కోసం ముందుగా..

ssc.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
హోం పేజీ పై కనిపించే రిజల్ట్ (result) లింక్ పై క్లిక్ చేయాలి.
స్క్రీన్ పై కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
అందులో మీ రోల్ నెంబర్ ను చెక్ చేసుకోవాలి.
భవిష్యత్ అవసరాల కోసం మీ రిజల్ట్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని హార్డ్ కాపీని కూడా భద్రపర్చుకోవాలి.

YES9 TV