Latest Posts

ఈ రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు.. కానీ!

దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక్​ అప్డేట్​ ఇచ్చింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). కర్ణాటక, ఉత్తర్​ ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

“జులై 2 నుంచి దక్షిణ ద్వీపకల్పంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య- దక్షిణ ఉత్తర ప్రదేశ్​లో సైక్లోనిక్​ సర్క్యులేషన్​ కొనసాగుతోంది,” అని తాజా బులిటెన్​లో వెల్లడించింది ఐఎండీ.

హిమాచల్​ ప్రదేశ్​లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. ఇక ముంబైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం భారీ వర్షం పడింది. గోవింది ప్రాంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

వివిధ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​ ఇలా..

వాయువ్య భారతం:- మరో రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో మోస్తారు వర్షపాతం నమోదవుతుంది. పశ్చిమ- తూర్పు రాజస్థాన్​, పశ్చిమ్​- తూర్పు, ఉత్తర్​ ప్రదేశ్​లో శనివారం జోరుగా వర్షాలు కురుస్తాయి.

మధ్య భారతం:- మధ్యప్రదేశ్​తో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.

పశ్చిమ భారతం:- కోంకణ్​, గోవా, మహారాష్ట్ర ఘాట్​ ప్రాంతాల్లో 5 రోజుల పాటు, గుజరాత్​లో 2 రోజుల పాటు వానలు పడతాయి.

తూర్పు- ఈశాన్య భారతం:- పశ్చిమ్​ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతం, సిక్కిం, బిహార్​, అసోం- మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురవొచ్చు. పశ్చిమ్​ బంగాల్​లోని గంగా నది తీర ప్రాంతంలో 3న వర్షాలు పడతాయి. ఝార్ఖండ్​, ఒడిశాల్లో ఈ నెల 3,4 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది.

దక్షిణ భారతం:- 5 రోజుల పాటు కేరళ, మహే, కర్ణాటక తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చు. మధ్య కర్ణాటక, తమిళనాడులో 2 నుంచి 4 వరకు, ఆంధ్రప్రదేశ్​ తీర- రాయలసీమలో 3 నుంచి 4 వరకు, తెలంగాణలో 4వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉంది.

జులైలో సాధారణ వర్షపాతమే..!

Rainfall predictions in July 2023 : ఐఎండీ ప్రకారం జూలైలో తూర్పు ఉత్తర్​ ప్రదేశ్​, దక్షిణ బిహార్​లను మినహాయించి దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదుకానుంది. అయితే.. జూన్​లో ఏర్పడిన లోటును జులైలో వర్షాలు భర్తీ చేస్తాయని పేర్కొంది.

జూన్​లో 16 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరీ ముఖ్యంగా బిహార్​, కేరళలో 69శాతం, 60శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. ఉత్తర్​ ప్రదేశ్​, మహారాష్ట్ర, ఝార్ఖండ్​, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాల తొలి నెలలో వర్షాలు సరిగ్గా కురవలేదు.

Posted Under AP
YES9 TV