కెన్యా: పశ్చిమ కెన్యాలోని లోండియాని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓడకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయి హైవే మీద పలు వాహనాలను ఢీకొట్టింది.
అనంతరం పాదచారులపై పడడంతో 48 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్ టీసీ బస్సులను షేక్ చేస్తున్న లేడీస్, కోట్ల మంది ఫ్రీ…ఫ్రీ….ఫ్రీ !
నైరోబీకి వాయువ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోండియానిలోని రిఫ్ట్ వ్యాలీ పట్టణానికి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 48 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కెరిఖో వైపు వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ఎనిమిది వాహనాలు, పలు మోటారు సైకిళ్లను, రోడ్డుపక్కన ఉన్న వ్యక్తులు, వ్యాపారులతో పాటు వ్యాపారం చెయ్యడానికి వచ్చిన సామాన్య ప్రజలను ఢీకొట్టడంతో మరో 30 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రులకు తరలించారు. ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో పాదచారులు, మార్కెట్ వ్యాపారులపైకి దూసుకెళ్లింది.
ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ టార్చర్, అనంతపురం లేడీ టెక్కీ చేసిన పనితో !
రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా, భారీ వర్షం ఆపరేషన్‌కు ఆటంకం కలిగించింది. మరికొందరు ధ్వంసమైన వాహనాల్లో చిక్కుకున్నారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపింది.
లొండియానీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ట్వీట్టర్ లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు దేశం సంతాపం తెలియజేస్తోందని ట్వీట్ చేశారు.
