Latest Posts

బీజేపీకి కష్టకాలం; కేసీఆర్ కి కలిసొచ్చే కాలం!!

కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బాగా కలిసి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోవాలని ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని శతవిధాల చేసిన ప్రయత్నాలన్నీ ప్రస్తుతం బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టుగా కనిపిస్తున్నాయి.

బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకతాటి మీద తెలంగాణ సీఎం కేసీఆర్ పై, బిఆర్ఎస్ పై సమరం చేయాల్సిన బిజెపి నేతలు దానిని పక్కన పెట్టి ఆధిపత్యపోరులో అంతర్భాగమయ్యారు. దీంతో బిజెపి అనుకున్న లక్ష్యానికి దగ్గరగా కాకుండా దూరంగా జరుగుతోంది.

 

సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు బిజెపిలో అదనపు బాధ్యతలు అప్పగించాలని బండి సంజయ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత నుండి తప్పించాలని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు కోరుకోవడం బిజెపి అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. వ్యూహాత్మకంగా ఎన్నికలకు పని చేయాల్సిన చోట బీజేపీ నేతలు అది పక్కన పెట్టి పదవులకోసం కొట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.

YES9 TV