Latest Posts

బండి సంజయ్ కు నడ్డా జలక్ – కాంగ్రెస్ కు అస్త్రంగా..!!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండికి పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా షాక్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రకటనకు భిన్నంగా జాతీయాధ్యక్షుడి ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అనిశ్చితి వేళ ఇప్పుడు ఈ వ్యవహారం ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ కు బండి టార్గెట్ కానున్నారు. రాష్ట్రంలో ప్రధాన అంశం పైన జాతీయ – రాష్ట్ర అధ్యక్షుడి మధ్య సమన్వయం లేకపోవటం వివాదంగా మారుతోంది.

 

తెలంగాణ బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ కొత్త గేమ్ ప్రారంభించింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో చేరికల పైన పోకస్ చేసింది. కాంగ్రెస్ ఇక అధికారంలోకి ఖాయం అనే విధంగా ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో తమదే అధికారం అంటూ ధీమాగా కనిపించిన బీజేపీ ఒక్క సారిగా డీలా పడింది. బీజేపీ నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరటం ఖాయమని ప్రచారం సాగుతోంది. అందులో ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అటు బీఆర్ఎస్..ఇటు బీజేపీ లక్ష్యంగా ఆరోపణల తీవ్రత పెంచింది. పార్టీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు.

YES9 TV